యూత్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, కేన్స్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిపోయింది. తళతళలాడుతున్న తెల్లటి టుక్సెడోను ధరించిన, అదే రంగులో ఉన్న మ్యాచింగ్ హై హీల్స్ వేసుకుని, రెడ్ కార్పెట్ పై నడుస్తున్న వేళ, వందలాది కెమెరాలు క్లిక్ మన్నాయి. ఆమె తన మెడలో ధరించిన పచ్చల హారం మరింత ఆకర్షించింది. ఎర్ర తివాచీపై సోనమ్ కపూర్ వయ్యారంగా నడుస్తూ హొయలొలికించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫెస్టివల్ కోసం సోనమ్ ను సిద్ధం చేసే బాధ్యతలను ఆమె సోదరి రియా కపూర్ తీసుకుందట. రియా ప్రత్యేకంగా స్టైలింగ్ చేయగా, సోనమ్ ఈ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ అలరించింది.
previous article
మోదీ, జగన్కు కేసీఆర్ శుభాకాంక్షలు
next article
బాలీవుడ్ లో సెటిల్ అవుతుందా..?
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment