టాలీవుడ్ అందాల సుందరి శ్రద్ధా శ్రీనాథ్. కన్నడలో ఈ అమ్మడు చేసిన ‘యూ టర్న్’ హిట్ కావడంతో అక్కడ ఈ సుందరికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాలో అమ్మడి సహజమైన నటనను చూసే, తెలుగులో ‘జెర్సీ’లో అవకాశం ఇచ్చారు. ‘జెర్సీ’ సినిమా విజయవంతం కావడంతో, శ్రద్ధా ఇక్కడ కూడా నటన పరంగా .. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.
దాంతో ఈ అమ్మడుని తమ సినిమాల్లోకి తీసుకోవడానికి టాలీవడ్ దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపాడం విశేషంగా మారింది. జాబితాలో కొరటాల శివ కూడా కనిపిస్తున్నారు. చిరంజీవితో ఆయన ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన ప్రధాన నాయికగా అనుష్క పేరును పరిశీలిస్తున్నారు. మరో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.