టాలీవుడ్ అందాల సుందరి సమంత. ఈ అమ్మడు మరోసారి తన పేరు మార్చుకుంది. పెళ్లికి ముందున్న సమంత రూత్ ప్రభు పేరు కాస్తా, అక్కినేని నాగ చైతన్యతో వివాహానంతరం సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు తన పేరును మార్చేసింది ఈ అమ్మడు తాజాగా సమంత అక్కినేని కాస్తా బేబి అక్కినేనిగా మారిపోయింది. దీని వెనుక ఓ కారణం ఉంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రం ‘ఓ బేబీ’.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీని కోసమే సామ్ తన పేరును మార్చుకుంది. తన పేరు మార్పు తన చిత్ర ప్రమోషన్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందని సామ్ ఆలోచనగా తెలుస్తోంది. పేరునే కాదు తన సోషల్ మీడియా డీపీని కూడా మార్చేసింది. ‘ఓబేబీ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫోటోను తన డిస్ప్లే పిక్‌గా మార్చేసుకుంది. ఈ విషయం షోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.