ఇంట్రెస్టింగ్ గా ‘ఓ బేబీ’ టీజర్…

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత నటించిన సినిమా ‘ఓ బేబీ’. ఈ సినిమా సౌత్ కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి ఇది రీమేక్. 70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ .. 20 ఏళ్ల యువతిని ఆవహిస్తే ఎలా వుంటుందనే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ ఫాంటసీ కామెడీలో వృద్ధురాలి పాత్రలో అలనాటి కథానాయిక లక్ష్మి కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, పూర్తి వినోదభరితమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ‘నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా వుండదు .. ఒక్కొక్కరికి .. చూస్తారుగా’ అంటూ సమంతతో చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకి వెళ్లినవాళ్లకి ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందేమో చూడాలి మరి.

Leave a Response