టాలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో రకుల్ తో పాటు సాయిపల్లవి కూడా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె చాలా చురుకుగా పాల్గొంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం అందరికి చెప్పింది. “ఈ సినిమాలో ఒక సీన్ కోసం నేను చాలా టేకులు తీసుకున్నాను. తాను అనుకున్నట్టుగా రావడం లేదంటూ మరుసటి రోజు చేద్దామని సెల్వరాఘవన్ అన్నారు. దాంతో ఆయనను మెప్పించలేకపోయినందుకు బాధపడ్డాను. ఇంటికి వెళ్లి అమ్మతో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ మరుసటి రోజు సింగిల్ షాట్ లోనే సెల్వ రాఘవన్ గారు ఓకే చెప్పారు. అంతకుముందు రోజు జరిగిన విషయాన్ని సూర్యగారి దగ్గర ప్రస్తావించాను. సెల్వరాఘవన్ ఎవరికీ సింగిల్ టేక్ లో ఓకే చెప్పరు .. నాతోనే చాలాసార్లు చేయిస్తాడు’ అని సూర్యగారు చెప్పడంతో అప్పుడు న మనసు కుదుట పడింది” అని ఆమె చెప్పుకొచ్చింది.
previous article
అమెరికాలో అనుష్క…
next article
అందరిని భయపెడుతున్న మిల్క్ బ్యూటీ….
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment