ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి పరిచయమైన అందమైన హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ అమ్మడు ‘సవ్యసాచి’ .. ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో అందరిని తన వైపు తిప్పుకుంది. నాజూకు భామగా వాళ్లతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ రెండు సినిమాలు పరాజయంపాలు కావడం వలన, ఆశించిన స్థాయిలో ఆమె కెరియర్ ఊపందుకోలేదు. ఈ రెండు సినిమాల తరువాత ఆమె ఒక్క ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో మాత్రమే అవకాశాన్ని అందుకోగలిగింది. చిత్రీకరణ పరంగా ముగింపుదశకి చేరుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి తమిళంలో ఒక ఛాన్స్ దక్కించుకుంది. తమిళంలో జయం రవి హీరోగా ‘బోగన్’ ఫేమ్ లక్ష్మణ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ కి అవకాశం దక్కింది. హోమ్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
previous article
అల్లు అర్జున్ చెల్లిగా నివేద.
next article
‘చక్కని పిల్ల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్…
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment