ప్రస్తుతం నాని .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్నాడు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోను నాని చేస్తున్నాడు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. నాని పాత్ర నెగటివ్ గా ఉంటుందనీ, ఒక రకంగా ఆయనే ఈ సినిమాకి విలన్ అనే టాక్ వచ్చింది.నాని నెగెటివ్ టచ్ వున్న పాత్రలో కనిపించడం నిజమేనట. అయినా ఈ తరహా పాత్రను నాని ఎందుకు చేశాడు? అని మాత్రం అనుకోరట. ఎందుకంటే స్నేహం కోసం త్యాగం చేసే కర్ణుడి తరహా పాత్రలో ఆయన కనిపిస్తాడట. తప్పని తెలిసినా స్నేహం కోసం తెగించి ముందుకు వెళ్లే ఈ పాత్ర ప్రేక్షకుల నుంచి సానుభూతిని తెస్తుందని అంటున్నారు. నాని కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని చెబుతున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
previous article
సాహో లో సల్మాన్…
next article
వెనుకంజలో మంత్రులు వైకాపా ఆధిక్యం
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment