టాలీవుడ్ న్యాచులర్ స్టార్ నాని ఒక వైపున హీరోగా… మరో వైపున నిర్మాతగాను చిన్న సినిమాలను నిర్మించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఆ మధ్య ఆయన నిర్మించిన ‘అ’ సినిమా అంతగా వసూళ్లను రాబట్టలేదు గానీ, ప్రయోగాత్మక సినిమా ప్రశంసలు అందుకుంది.తాజాగా ఆయన మరో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడన విషయం ఎప్పుడు టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ‘ఫలక్ నుమా దాస్’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాని, ఇదే హీరోతో తన సొంత బ్యానర్ అయిన ‘వాల్ పోస్టర్’పై ఒక సినిమాను నిర్మించనున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం తాను ‘గ్యాంగ్ లీడర్’ .. ‘వి’ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాననీ, ఈ రెండు ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత నిర్మాతగా తన తదుపరి సినిమా మొదలవుతుందని అన్నాడు మన న్యాచులర్ స్టార్.
previous article
కొత్త సినిమా తో వస్తున్న కళ్యాణ్ రామ్…
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment