నాని హీరో గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘జెర్సీ’ సినిమా.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్ననే థియేటర్లకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 4.6 కోట్ల షేర్ ను రాబట్టింది. మౌత్ టాక్ బాగుండటంతో, ఈ రోజు .. రేపు వసూళ్లు బాగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
తొలి రోజున ఈ సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లనే సాధించేదిగానీ, ‘కాంచన 3’ కూడా ఇదే రోజున విడుదల కావడం వలన, కొంత ఎఫక్ట్ పడిందని అంటున్నారు. లారెన్స్ నుంచి గతంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రాలు భారీ వసూళ్లతో, ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ‘కాంచన 3’పై అంచనాలు వున్నాయి. ఈ కారణంగానే ‘జెర్సీ’ తొలిరోజు వసూళ్లపై ప్రభావం పడిందనే టాక్ వినిపిస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సత్యరాజ్ కీలకపాత్రల్లో కనిపించారు.