కొత్త సినిమా తో వస్తున్న కళ్యాణ్ రామ్…

టాలీవుడ్ హీరో క‌ల్యాణ్‌రామ్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్ప‌టికే తాను న‌టించిన మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`, `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు`లో త‌న తండ్రి హ‌రికృష్ణ పాత్ర‌ను పోషించారీయ‌న‌. అలాగే కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `118`లోనూ న‌టించారు మన హీరో. ఈ సినిమా డీసెంట్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈయ‌న సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నారు. వేణుమ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు `అశ్వ‌త్థామ‌` అనే పేరు ప‌రిశీల‌నలో ఉన్న‌ట్లు టాలీవుడ్ టాక్. కాగా త‌దుప‌రి సినిమా క‌ల్యాణ్ రామ్, స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాతో అభిమానుల ముందుకు వతున్నాడు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమా నిర్మించ‌నుంద‌ట‌. అశ్వ‌త్థామ త‌ర్వాత ఈ సినిమా రూపొందుతుందన విషయం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది.Image result for kalyan ram

Leave a Response