టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా. ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ ఇప్పుడు సీనియర్ హీరోయిన్ మాత్రమే! అయినా వెండితెర మీద మీనా హవా ఏమీ తగ్గలేదట. సినిమాల్లో రోజూవారీ పారితోషికాన్ని అందుకుంటోంది మీనా. అదే లెక్కన బుల్లి తెర మీద కూడా ఛార్జ్ చేయబోతోంది. త్వరలో తెలుగులో ప్రసారం కానున్న ఓ షోకి మీనా టెంపరరీ జడ్జిగా వ్యవహరించనుంది. ఇందుకు గాను మీనా దగ్గర దగ్గర ఐదు లక్షల రూపాయల వరకూ తీసుకోబోతోందట! బుల్లి తెరను కూడా వెండితెరతో సమానంగా భావించే మీనా ఇంత కావాలంటోందట!