టాలీవుడ్ యాంగ్ హీరో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్‌ను అభిమానుల ముందుకు తెస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. ఆలియా భట్ ఓ కథానాయికగా నటిస్తోంది. మరో హీరోయిన్ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్, టాలీవుడ్ జేజమ్మ అనుష్క ఓ కీలక పాత్రలో అభిమానుల ముందుకు వస్తుంది. అయితే ఈ పాత్ర కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. రాజమౌళి అడిగిన వెంటనే ఈ పాత్రలో నటించేందుకు అనుష్క ఓకే చెప్పినట్టు టాలీవుడ్ టాక్.