టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్, యాంగ్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా అభిమానుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆయన తల్లిపాత్రలో ‘టబు’ నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత వుంటుందట. అందువలన నివేదా థామస్ ను ఎంపిక చేశారనేదే టాలీవుడ్ టాక్. క్రేజీ ప్రాజెక్టు కావడం వలన నివేదా థామస్ ఈ పాత్రను చేయడానికి అంగీకరించిందని చెప్పుకున్నారు. ఈ ప్రచారం మరింత జోరందుకోవడంతో నివేదా థామస్ స్పందించింది. ఈ సినిమా కోసం తనని ఎవరూ సంప్రదించలేదనీ, ఈ సినిమాలో తను చెల్లెలి పాత్రను చేయనున్నాననే వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఇలా నివేదా థామస్ పుకార్లకు తెరదింపేసింది.
previous article
బాలీవుడ్ లో సెటిల్ అవుతుందా..?
next article
తమిళంలో చాన్స్ పట్టేసింది…
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment