టాలీవుడ్ లో హిట్ కొట్టిన సినిమా ‘చంద్రముఖి’.ఈ సినిమాలో మలయాళంలో ‘మణిచిత్రతాళు’ పేరుతో తెరకెక్కిన సినిమా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో రజనీకాంత్ కథానాయకుడిగా ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో ‘చంద్రముఖి’ పేరుతో రీమేక్ చేశారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది. ఇక కన్నడలో ‘ఆప్తమిత్ర’ పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అక్షయ్ కుమార్ హీరోగా .. ‘భూల్ భులయ్య’ పేరుతో హిందీలోకి ఈ సినిమాను ప్రియదర్శన్ రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా బాగానే ఆడింది. మళ్లీ ఇంతకాలానికి హిందీలో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. త్వరలో ‘భూల్ భులయ్య 2’ సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.
previous article
పదో తరగతి ఫలితాల విడుదల నేపథ్యంలో.. కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..
next article
హీరోగా మారనున్న మాస్ డైరెక్టర్!
Related Posts
- /No Comment
విజయవాడలోని పూజారిఫై మహిళలు దాడి..
- /No Comment