హీరోగా మారనున్న మాస్‌ డైరెక్టర్‌!

ఆది లాంటి సూపర్‌ హిట్ సినిమాతో పరిచయం అయిన మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌. హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో సూపర్బ్ అనిపించుకున్న వినాయక్‌ దిల్‌, ఠాగూర్‌, కృష్ణ, అదుర్స్‌, ఖైదీ నంబర్‌ 150 లాంటి సూపర్‌ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇటీవల వరుస తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న వినాయక్‌ త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట.

త్వరలో వినాయక్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుంది. గతంలో ఠాగూర్‌లో చిన్న పాత్రలో కనిపించిన వినాయక్‌ పూర్తి స్థాయి నటుడిగా ఇంతవరకు కనిపించలేదు. అయితే దర్శకుడు నరసింహరావు వినాయక్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే ఈ వార్తలను వినాయక్‌గానీ, దిల్‌ రాజుగానీ ఇంత వరకు ధృవీకరించలేదు.

Leave a Response