సైరా.. ముందే వస్తోన్న మెగాస్టార్‌?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కావటంతో మెగా ఫ్యామిలీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సైరాను కాస్త ముందుగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దసరాకు కాకుండా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న సినిమా సైరాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. గాంధీ జయంతి రోజు విడుదల చేస్తే లాంగ్ వీకెండ్‌తో పాటు దసరా సెలవులు కలిసి వస్తాయని భావిస్తున్నారట.

అయితే గ్రాఫిక్స్‌ వర్క్‌ చాలా ఉండటంతో అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి అవుతాయా.. లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుకు జోడిగా నయనతార నటిస్తున్న ఈ సినిమాతో తమన్నా, అనుష్క, జగపతి బాబు, సుధీప్‌‌, విజయ్‌ సేతుపతిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నరసింహారెడ్డి గురువుగా అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Leave a Response