చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడిన తొలి తరం పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాత. ఇటీవలే కేరళ అడవుల్లో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఇప్పటికే నయనతార, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మరో కథానాయికకూ చోటుందట. ఆ పాత్ర కోసం అనుష్కని సంప్రదిస్తున్నట్టు సమాచారం. కథని నడిపే ఆ పాత్ర నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణతో సినిమా పూర్తవనున్నట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌సేతుపతి తదితర ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, సంగీతం: అమిత్ త్రివేది.
previous article
ఎవడేమన్నా నేను మళ్లీ తిరిగొస్తా..
next article
నా వల్లే ఆమె పెళ్లి జరిగింది!
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment