ప్రముఖ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్’. జై రాజా సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్ను ఆదివారం విడుదల చేశారు. ‘ఈ భూమ్మీద పుట్టి చనిపోయే ప్రతి మనిషి.. మొట్టమొదటగా, చిట్టచివరగా చూసేది డాక్టర్నే. మానవ శరీరాన్ని సృష్టించేది దేవుడే అయినా.. అప్పగించేది మాత్రం వైద్యుడే’ అన్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ఇందులో శ్రీకాంత్ డాక్టర్ పాత్రలో నటించారు. ఓ పక్క వైద్యం చేస్తూనే మరోపక్క దుండులను చితకబాదుతూ కనిపించారు. వైద్యం పేరుతో ఆడవాళ్లను కిడ్నాప్ చేసి స్టెరాయిడ్లు ఎక్కించడం వంటి సన్నివేశాలను చూస్తే ఇదో క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని తెలుస్తోంది. అభయ్, మేఘా, రష్మి కీలక పాత్రలు పోషించారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
previous article
జనసేనకు భారీ షాక్
next article
ఎన్జీకే సెట్లో కంటతడి పెట్టిన సాయి పల్లవి
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment