రాశీ ఖన్నా కథానాయికగా విశాల్‌కు జోడీగా నటించిన ‘అయోగ్య’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాశీకి రవీనా అనే యువతి డబ్బింగ్ చెప్పారు. అయితే సినిమా క్రెడిట్స్‌లో రవీనా పేరును జోడించలేదు. దాంతో ట్విటర్ వేదికగా రవీనా తన బాధను వ్యక్తపరిచారు. ఇందుకు రాశీ ఖన్నా స్పందిస్తూ.. ‘గుర్తించనందుకు సారీ రవీనా. కానీ, నీ మధురమైన స్వరాన్ని అరువిచ్చి నా పాత్రను మరింత అందంగా మలచినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు. దీనికి రవీనా ప్రతిస్పందిస్తూ.. ‘ధన్యవాదాలు రాశీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్ చెప్పినందుకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
next article
మన్మథుడిని ఆలోచనలో పడేసిన ‘గ్యాంగ్ లీడర్’
Related Posts
- /No Comment
టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి..!
- /No Comment