ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి వైకాపా 134 స్థానాల్లో, తెదేపా 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మంత్రులుగా పనిచేసిన నారా లోకేశ్, అఖిలప్రియ, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చిన రాజప్ప, అమర్నాథ్రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర వెనుకంజలో ఉన్నారు. కృష్ణా జిల్లా మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, తిరువూరు నుంచి జవహర్, చిలకలూరిపేట నుంచి ప్రత్తపాటి పుల్లారావు ముందంజలో ఉన్నారు. ఎంపీ స్థానాల్లోనూ వైకాపా అధిక్యంలో ఉంది. వైకాపా 20 స్థానాల్లో, తెదేపా 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఉదయం నుంచే ఓట్ల లెక్కింపు పర్యవేక్షించేందుకు బుధవారం జగన్‌తో పాటు వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చారు. మరోవైపు పరిస్థితులన్నీ వైకాపాకు అనుకూలంగా ఉన్నాయని జగన్ నివాసం వద్ద నేతలు ధీమా వ్యక్తం చేశారు.
previous article
విలన్ గా మారుతున్న నాని..?
next article
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పవన్….
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment