మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు జపాన్ అభిమానుల నుంచి సర్ప్రైజ్ వచ్చింది. చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలోని పాత్రల బొమ్మలను గ్రీటింగ్ కార్డులపై గీసి ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్’ అని రాసి పంపించారు. దాదాపు 50కి పైగా గ్రీటింగ్ కార్డులు చరణ్‌కు అందాయి. మార్చి 27న చరణ్ తన 34వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో జపాన్ అభిమానులు ఈ రకంగా చరణ్ పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. చరణ్ ఈ గ్రీటింగ్ కార్డును ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ..
‘జపాన్ నుంచి స్వీట్ సర్ప్రైజ్ను అందుకున్నాను. నా పట్ల మీకున్న ప్రేమానురాగాలు నన్నెంతో సంతోషపరిచాయి. నా జపాన్ అభిమానులకు ప్రేమను పంపుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. థాంక్యూ జపాన్’ అని పేర్కొన్నారు. చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రం జపాన్‌లో విడుదలై మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం చరణ్.. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇందులో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్ కొమరం భీమ్ పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. 2020 జులై 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..