తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరంభ ఫలితాల్లో అధికార T R S పార్టీ ముందంజలో దూసుకెళ్తోంది. T R S అభ్యర్థులు సికింద్రాబాద్‌లో తలసాని సాయికిరణ్ యాదవ్ , భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్, వరంగల్‌లో పసునూరి దయాకర్, జహీరాబాద్‌లో బీబీ పాటిల్, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, పెద్దపల్లిలో నేతకాని వెంకటేశ్, మెదక్‌లో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్లో బండి సంజయ్(భాజపా), ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు(భాజపా) చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్), హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) ముందంజలో ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్‌కు కేసీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని కేసీఆర్ ఆకాంక్షించారు. జగన్‌కు T R S కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. మీరు పడిన కష్టానికి ప్రజల ఆశీర్వాదం రూపంలో మంచి ఫలితం దక్కిందని కొనియాడారు
previous article
కామెడీ తో వస్తున్న విక్టరీ…
next article
తన అందం తో ఆక్కటుకుంటున్న సోనమ్ కపూర్…
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment