ప్రజలే కొత్త టీమ్‌ను ఎంపిక చేస్తారు చంద్రబాబు……

మే 23న దేశ ప్రజలు ప్రధానిగా మోదీని, అతని టీమ్‌ను తిరస్కరించడం ఖాయమని ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో స్పష్టం చేశారు. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్‌నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్నారని, మోదీ టీమ్‌కు పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్‌ను ప్రజలే ఎంపిక చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని అన్నారు. తమ పోరాటం భారత ఎన్నికల సంఘంపై కాదని, అధికారుల వివక్షతపై, పక్షపాత ధోరణిపైనేనని మరో మారు స్పష్టం చేశారు.

మోదీ, అమిత్‌ షాలపై మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ను ఈసీ అమలు చేయకపోవడంపైనే తమ పోరాటమన్నారు. రాజకీయ లబ్ధికోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా మోదీ వెనుకాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణశాఖను, సైన్యాన్ని వాడుకుంటూ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారని దుయ్యబట్టారు. అలాంటి ట్రాక్‌ రికార్డు ఉన్న మోదీ తమకు నీతి ప్రబోధిస్తున్నారన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు 73 రోజులు తీసుకున్న ఈసీకి 50శాతం వీవీప్యాట్‌ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరమని ప్రశ్నించారు. 50శాతం వీవీ ప్యా్ట్‌లు లెక్కించాలని ఈసీని ప్రతిపక్షాలు  అడిగితే మోదీకి ఏం సంబంధమని, ఆయనెందుకు ఉలిక్కి పడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

 

Leave a Response