టాలీవుడ్ అభిమానులను ‘హార్ట్ అటాక్’ తెప్పించలేని హీరోయిన్లలో అదాశర్మ పేరు నిక్షేపంగా చేర్చుకోవచ్చు. అదాశర్మ ఎన్ని ఫోటో షూట్లు చేసినా, ఎంతగా అందాలు ఆరబోసినా దక్షిణాదిన మాత్రం పాగా వేయలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో చిన్నా చితకా సినిమాలు చేస్తున్న అదాశర్మ త్వరలోనే పెళ్ళి పీటలెక్కబోతోందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌ను మనువాడబోతోందన్న వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అందరు హీరోయిన్లు చేసే పనే అదాశర్మ కూడా చేసింది. ఈ వార్తలు నిజంకాదంటూ కొట్టిపారేసింది. అయితే నిప్పులేనిదే పొగరాదు అన్న సామెత అదాకు తెలిసినట్టులేదంటున్నారు సినీ జనాలు.
