ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. బరిలోకి దిగిన రెండో స్థానాల్లో.. ఒక స్థానం నుంచి పవన్ ఓటమి చవిచూడగా, మరో స్థానంలో వెనుకంజలో కొనసాగుతున్నారు. భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు గాజువాకలో 13 రౌండ్లు పూర్తయ్యేసరికి 4,500పై చిలుకు ఓట్ల వెనుకంజలో పవన్ ఉన్నారు.ఇక రాష్ట్రంలో జనసేన కేవలం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుండం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోల్ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
previous article
‘చక్కని పిల్ల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్…
next article
చంద్రబాబు రాజీనామా
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment