జమ్మూ: ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ప్రమాదంలో శనివారం జమ్మూ-కశ్మీర్లో 13 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. పూంచ్ జిల్లా మండిలోని ప్లేరా వద్ద కొండ ప్రాంతంలో బస్సును మలుపు తిప్పే సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 100 మీటర్ల లోయలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది. మృతుల్లో నలుగురు మహిళలున్నారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వారిని విమానం ద్వారా జమ్మూ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం పట్ల గవర్నర్ సత్యపాల్ మాలిక్ విచారం వ్యక్తం చేశారు. కాగా పర్వత ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ప్రాంతాల్లో నడిపే వాహనాల పరిస్థితిని తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
previous article
ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి
next article
‘గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి’
Related Posts
- /No Comment
సైరా కొత్త ట్రైలర్ సూపర్..!
- /No Comment