చికెన్ కట్ లెట్ తయారీ విధానం..

కావలసినవి :-

చికెన్ : పావుకిలో,

జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు,

ఉల్లిపాయలు: ఒకటి,

పచ్చిమిర్చి: మూడు,

అల్లంవెల్లుల్లి: టీస్పూను,

పెరుగు: 2 టేబుల్‌స్పూన్లు,

జాజికాయపొడి: చిటికెడు,

జాపత్రిపొడి: చిటికెడు,

గరంమసాలా: పావుటీస్పూను,

గుడ్డు: ఒకటి,                       

బొంబాయిరవ్వ: కప్పు,

ఉప్పు: తగినంత,

నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం :-

చికెన్ కీమాను{చికెన్ ను కీమా లాగా చిన్నగా కొట్టించాలి} కడిగి నీళ్లు లేకుండా పిండాలి. అందులో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు ఈ మొత్తాన్నీ మిక్సీలో వేసి ఓసారి రుబ్బి తీసి పక్కన ఉంచాలి. తరవాత పెరుగు, తగినంత ఉప్పు, జీడిపప్పుముక్కలు, అల్లంవెల్లుల్లి, జాజికాయ, జాపత్రి, గరంమసాలా పొడులన్నీ వేసి కలపాలి. తరువాత గుడ్డుసొనని బాగా గిలకొట్టాలి. చికెన్ మిశ్రమాన్ని మందపాటి వడల్లా చేసి గుడ్డుమిశ్రమంలో ముంచి రవ్వలో దొర్లించి పాన్‌లో నూనెవేస్తూ రెండువైపులా దోరగా  కాల్చి తీయాలి అప్పుడు టెస్ట్య్ టెస్ట్య్ చికెన్ కట్ లెట్ తినడానికి రెడీ.

Tags:chikenchiken katletchiken manchuriya

Leave a Response