‘చక్కని పిల్ల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్…

హీరో ప్రభుదేవా .. టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా .. నందిత శ్వేత ప్రధాన పాత్రధారులుగా తమిళంలో రూపొందిన ‘దేవి 2’ ఈ నెల 31వ తేదీన అభిమానుల ముందుకు వస్తుంది. తెలుగులో ‘అభినేత్రి 2’ టైటిల్ తో ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను పలకరించనుంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు “చక్కని పిల్లా చక్కర బిళ్లా చిక్కని సోకుతో చంపొద్దే .. ” అంటూ ఈ పాట సాగుతోంది. ఈ సాంగ్ మేకింగ్ షాట్స్ ను బట్టి ప్రభుదేవా – నందిత శ్వేతపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

Leave a Response