ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వ్యోమగామిగా నటిస్తున్నాడు. ‘అంతరిక్షం 9000 KMPH’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది
డిసెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మిరా అనే శాటిలైట్ దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతరిక్షంలో ఆఫీసర్ దేవ్ చేసిన సాహసమే ఈ సినిమా కథ అని తెలుస్తోం