సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అనేది ఉపశీర్షిక. హన్సిక కథానాయిక. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మాతలు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘కేసులు లేని ఓ ప్లీడరు కథ ఇది. పొట్టకూటి కోసం తనేం చేశాడన్నది ఆసక్తికరం. ఆద్యంతం వినోదం పంచే సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తామ’’న్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: సాయి కార్తీక్.
previous article
బట్టతల వచ్చేసింది.. ఇక పెళ్లెందుకు?
next article
తెలివైన కిల్లర్
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment