కేసీఆర్‌ బయోపిక్‌: పాట పాడిన వర్మ!

నిజ జీవిత కథలను తెరకెక్కించడంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మది అందెవేసిన చేయి. ‘రక్త చరిత్ర’ దగ్గరి నుంచి ఇటీవల కాలంలో వచ్చిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ వరకూ ఆయన సినిమాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘టైగర్‌: కేసీఆర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఇటీవల ఆ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని పాటను రాంగోపాల్‌వర్మ పాడి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

‘బ్రిటిష్‌ ప్రభుత్వంపై శాంతియుతంగా పోరాడి గాంధీ స్వతంత్ర భారత్‌ను సాధించారు. అగ్రెసివ్‌ గాంధీ కేసీఆర్‌ ఆంధ్రా పెత్తందారులపై పోరాడి తెలంగాణ సాధించారు’ అని ట్వీట్‌ చేస్తూ, ‘మా భాష మీద నవ్వినావ్‌.. మా ముఖాల మీద ఊసినావ్‌.. మా బాడీల మీద నడిసినావ్‌ ఆంధ్రోడా.. వస్తున్నా.. వస్తున్నా.. నీ తాట తీయనీకి వస్తున్నా..’ అంటూ పాట వీడియోను పంచుకున్నారు.

Leave a Response