ఆపరేషన్ గరుడ వెనకు ఉన్నదో ఎవరో తెలుసుకోవాలని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌కు ఏపీ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో రాష్ట్రంలో దుమారం రేగుతోంది. అయితే ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సినీ నటుడు శివాజీ గతంలో ఆపరేషన్ గరుడ గురించి మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినవిధంగానే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో ఈ ఆపరేషన్ గరుడ పేరుతో జరుగుతున్న కుట్రపై దర్యాప్తు జరపాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ గరుడపై విచారణ జరపాలని, తిత్లీ తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రిని బీజేపీ నేతలు కోరారు.
అనంతరం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్