కాళేశ్వరం ప్రాజెస్ట్ పై నాగార్జున ట్వీట్…

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది. గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు ఏత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం. వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయము (సర్జి పూల్) ఏర్పాటు, భూగర్భం లోనే నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.2019, ఏప్రిల్ 24న ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం అండర్ టన్నెల్‌లోని మొదటి మోటర్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి 0.01 టీఎంసీల నీటిని 105 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేయబడింది. నందిమేడారం పంప్‌హౌస్‌లోని 124.4 మెగావాట్ల తొలి మోటర్ వెట్న్‌న్రు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ మధ్యాహ్నం 12.03 గంటలకు పూజలుచేసి ప్రారంభించడంతో సర్జ్‌పూల్ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రయోగం విజయవంతమైంది.2019 జూన్ 21 న ప్రాజెక్టు ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూజ, హోమ క్రతువు జరిపిన తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్ దగ్గర ప్రారంభోత్సవం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులను ప్రారంభించట ద్వారా జరగనుంది.ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని స్విచ్‌ ఆన్ చేసి ఆవిష్కరించారు. ఓ వైపు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరుగుతుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకున్నారు.

Related image

అయితే ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మానవ ఇంజనీర్ల అద్భుత సృష్టిగా అభివర్ణించారు. ‘నీరు ప్రాణ సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఆల్ ది బెస్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మానవ ఇంజినీర్ల అద్భుత సృష్టి’ అని నాగార్జున్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Image result for nagarjuna

Leave a Response