‘ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నా’ అంటున్నారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. టాలీవుడ్లో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అజయ్ దేవగణ్ సరసన ఆమె నటించిన సినిమా ‘దే దే ప్యార్ దే’. టబు మరో కథానాయిక. అకీవ్ అలీ దర్శకత్వం వహించారు. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో 26 ఏళ్ల రకుల్ 50 ఏళ్ల అజయ్ ప్రేయసిగా నటించారు. ఆయన మాజీ భార్య పాత్రను టబు పోషించారు.
ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల వెబ్సైట్ ‘నిజ జీవితంలో మీ కన్నా వయసు బాగా ఎక్కువ ఉన్న వ్యక్తిని ప్రేమిస్తారా?’ అని రకుల్‌ను తాజాగా ప్రశ్నించింది. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం కొందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘నిజ జీవితంలో నేను ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నా. ఆ వ్యక్తి వృద్ధుడా? లేదా యువకుడా?అనేది అనవసరం’ అని ఆమె అన్నారు.