ఆస్ట్రేలియాతో తొలి టెస్టు నేటి నుంచే
ఆత్మవిశ్వాసంతో టీమ్ఇండియా కంగారూల గడ్డపై తొలి టెస్టు, ఇంతకుముందెప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసం, ఎప్పుడూ లేనంత ఉత్సాహం, ఎప్పుడూలేనన్ని అంచనాలు! ఆస్ట్రేలియాలో టీమ్ఇండియా కథ మలుపు తిరగబోతోందన్న భావన! ఆటగాళ్ల నుంచి అభిమానుల వరకు ఒకే మాట.. కోహ్లీసేనకు చర్రిత తిరగరాసేయగలదని, అక్కడ తొలి సిరీస్ నెగ్గేందుకు ఇదో అద్భుత అవకాశం అని. విశ్లేషకుల ఓటూ భారత్‌కే!