ఎన్టీఆర్ పీఆర్ టీమ్‌లో కీలక వ్యక్తి, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో కలిసి హరీష్ శంకర్ ఓ సినిమా చేయనున్నాడు. నందమూరి కల్యాణ్‌రామ్‌తో ‘నా నువ్వే’, ‘118’ సినిమాలను మహేశ్ కోనేరు నిర్మించారు. దీపావళికి తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా ‘బిగిల్’ను తెలుగులో ‘విజిల్’గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రెస్మీట్లో ‘‘త్వరలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో మహేశ్ కోనేరుతో నేను ఒక సినిమా చేయబోతున్నా’’ అని హరీష్ శంకర్ తెలిపారు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వంలో వహిస్తారో?‘గద్దలకొండ గణేష్’తో తానింకా ఫామ్‌లో ఉన్నానని హరీష్ శంకర్ చెప్పాడు. అతడు ఫుల్ ఫామ్‌లో ఉండుంటే ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమా వచ్చేది. తమిళ సినిమా కథ కొన్ని పరిమితులు విధించడంతో వీలైనంత మేరకు మంచి సినిమా అందించారు. హీరోకి కొత్త ఇమేజ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత హరీష్ చేయబోయే సినిమా ఏది? వాట్ నెక్ట్స్? ఇంకా అఫీషియల్ ఆన్సర్ రాలేదు. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే, నిర్మాతగానూ మారనున్నాడు.