తమన్‌ కు ఎస్పీబీ వార్నింగ్…

‘తొలిప్రేమ’, ‘ఛల్‌ మోహన్‌రంగ’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహానుభావుడు’ సినిమాలు తమన్‌ కు మంచి పేరు తీసుకొచ్చాయి. డిసెంబర్‌ 13న విడుదల కానున్న ‘వెంకీ మామ’, 20న విడుదల కానున్న ‘ప్రతిరోజూ పండగే’, జనవరి 12న సంక్రాంతి కానుకగా వస్తున్న ‘అల… వైకుంఠపురములో’, జనవరి 24న వస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రాలకు తమన్‌ సంగీతం అందిచారు. ‘వెంకీమామ’ విడుదల సందర్భంగా మాట్లాడుతూ ‘‘ వెంకటేశ్‌గారు, నాగచైతన్య పోటీపడి నటించారు. నాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. రెట్రో సాంగులో వెంకటేశ్‌గారు డ్యాన్సు ఇరగదీశారు. ఒకసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఫోన్‌ చేసి మరీ తిట్టారు. ఒక రీమిక్స్‌ సాంగ్‌ గురించి తిట్టారు. నాకు ఒక 60 ఏళ్లు వచ్చాక నా పాటలను ఎవరైనా రీమిక్స్‌ చేస్తే నేనూ ‘పాడుచేశాడు’ అని తిట్టుకుంటాను” అని అన్నారు. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తోన్నచిత్రం ‘వెంకీమామ’. ఈ సినేమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందు రానుంది. కానీ అదే రోజు వెంకటేశ్ పుట్టినరోజు కావడం విశేషం.ఈ సినిమాకు డి. సురేశ్‌బాబు, టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Tags:ss taman

Leave a Response