టాలీవుడ్ లో ప్రేమకథలకు కొదవలేదని చెబుతూ వస్తున్న చిత్రం ‘జాను’. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. నా కోసం ఓ చూపు అప్పుగా ఇవ్వలేవా… నీ ఓర చూపు కోసం, నీతో ఒక నవ్వు కోసం, రాత్రంతా చుక్కలు లెక్కబెడుతోంది నా హృదయం అంటూ శర్వా కవితాత్మక డైలాగులతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే యూత్ కు ఓ పండుగలాంటి సినిమా అని అర్థమవుతోంది. తమిళ చిత్రం ’96’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘జాను’ చిత్రానికి సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్, సాంగ్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ తో ‘జాను’పై మరింత హైప్ పెరిగింది.
previous article
‘అశ్వద్ధామ కు U/A సర్టిఫికెట్ మంజూరు
next article
హీరో తల్లి పాత్రకు నో చెప్పిన రేణూ దేశాయ్
Related Posts
- /
- /No Comment
మేము CAA & NRC వ్యతిరేకం
- /No Comment