మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను , బాలకృష్ణ కాంబినేషన్లో కొత్త సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ షాట్‌లోనే “నువ్వొక మాటంటే అది శబ్దం, అదే మాట నేనంటే అది శాసనం” అనే పవర్ఫుల్ డైలాగ్‌ను తనదైన స్టైల్లో అన్నారు బాలకృష్ణ. ” ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. అలాగే ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో కథలు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. అలాగే ఈ కథ అద్భుతంగా వచ్చింది. అటువంటి తరుణంలో మా కాంబినేషన్లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని’ అన్నారు బాలకృష్ణ. ఒక ప్రత్యేక పాత్ర కోసం యాంకర్ రష్మీని బోయపాటి సంప్రదించారట. బుల్లితెర పై అలరిస్తునానఁ రష్మీ కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రలోనూ మెప్పించారు. ఈ సినిమాలో కథను కీలక మలుపుతిప్పే పాత్రతో పాటు, గ్లామర్ గా కనిపించాల్సి ఉండటంతో రష్మిని సంప్రదించారని సమాచారం.
