‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం..’ అంటూ సాగిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా పాటను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. హీరో కల్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా గోపీ సుందర్ సంగీతం అందించారు. సతీశ్ వేగేశ్న దర్వకత్వంలో రూపొందుతున్న ‘ఎంత మంచివాడవురా’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ రామ్ సరసన మెహరీన్ నటిస్తోంది. శరత్ బాబు, సుహాసిని, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల తదితరులు ఈ చిత్రంలో నటించారు. చాలా రోజుల తరువాత కొత్త సినిమాతో హీరో కల్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. కుటుంబ కథ నేపధ్యంలో రానున్న చిత్రం ఇది. ఈ సినిమాపై హీరో కల్యాణ్ రామ్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నట్టు సమాచారం.