తీన్మార్ వార్తలతో టీవీ ప్రేక్షకులకు పరిచయమైన మంగ్లీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పాపులర్ యాంకర్‌గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలంగాణ పండగ ‘బతుకమ్మ’ పాటలతో తెలుగు ప్రజల్లో మంగ్లీ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇన్నాళ్లూ గాయనిగా, టీవీ యాంకర్‌గా బుల్లితెర వీక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు వెండితెరపై కనిపించనుంది. గాయని మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్వేచ్ఛ’. కేపీఎన్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్ పతాకంపై ఆంగోత్ రాజునాయక్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. తండా స్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ పాత్ర నేటి అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్, వినోదంతో రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ నెల 22న పాటలను విడుదల చేస్తాం’. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ పిల్లలూ అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది’’ అన్నారు కేపీఎన్ చౌహాన్ .