నటి తమన్నా ముంబయిలోని వర్సోవా ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ను రెట్టింపు ధరకు కొనుగోలు చేసినట్లు ఇటీవల తెగ ప్రచారం జరిగింది. సముద్ర తీరాన ఉన్న అందమైన ఇంటిని రూ.16 కోట్లకు ఆమె కొన్నట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో ఉన్న ధర కంటే.. రెట్టింపు మొత్తం ఇచ్చి తనకు ఇష్టమైన ఇంటిని సొంతం చేసుకున్నట్లు రాసుకొచ్చారు. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఇల్లు కొన్నావా? అని తన హిందీ టీచర్ మెసేజ్ చేశారని తెలిపారు. ‘రెట్టింపు ధరకు నేనేందుకు కొంటానని మా టీచర్‌కు చెప్పా’ అని తమన్నా చెప్పడంతో సదరు టీచర్ ఆమె తరఫున ట్వీట్ చేశారు.అయినా సరే అభిమానులు నమ్మలేదు. మిల్కీ బ్యూటీని దీని గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ‘చాలా రోజులు అయినప్పటికీ ప్రజలు ఇదే ప్రశ్న అడుగుతుంటే నాకు విసుగొస్తోంది. నేను ఇల్లు కొన్నా, కానీ రెట్టింపు మొత్తం ఇవ్వలేదు. ఇంటి పనులు పూర్తయ్యాక మా తల్లిదండ్రులతో కలిసి అక్కడికి షిఫ్ట్ అవుతా. నాకు సింపుల్‌గా జీవించడమే ఇష్టం’ అని తాజాగా తమన్నా చెప్పారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి లోఖండ్వాలా కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. ఇప్పుడు మిల్కీబ్యూటీ చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’, ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ తమిళ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. అదేవిధంగా మరో తమిళ చిత్రంలోనూ కథానాయికగా సందడి చేయనున్నారట.
previous article
సినీ నటి తాప్సి ఛాలెంజ్….
next article
నాగార్జున మనసు మళ్లింది..!
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment