తెలుగు చిత్ర పరిశ్రమకు పలు హిట్లు ఇచ్చిన దర్శకుల్లో వి.వి. వినాయక్ ఒకరు. ఆయన హీరో అవతారం ఎత్తబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించనున్న ఈ ప్రాజెక్టును ఇటీవల ప్రకటించారు. ‘శరభ’ దర్శకుడు నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభం కాబోతోందట. కాగా ఈ సినిమా కోసం వినాయక్ స్లిమ్‌గా తయారవుతున్నారు. వ్యాయామశాలలో కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆయన జిమ్‌లో దిగిన ఫొటో బయటికి వచ్చింది. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వినాయక్ ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలలోని ఓ సన్నివేశంలో కనిపించిన సంగతి తెలిసిందే.వినాయక్ దర్శకత్వంలో చివరిసారి ‘ఇంటిలిజెంట్’ సినిమా వచ్చింది. సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. దీని తర్వాత వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరిగింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించనున్నట్లు చెప్పుకొచ్చారు. మరి ఈ వదంతుల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.