రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రచారం ….

 తన ఓటరు కార్డుపై తప్పుడు వార్తలు వస్తున్నాయని కథానాయకుడు మంచు మనోజ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మున్సిపాలిటీలోని చిరునామాతో మంచు మనోజ్‌కు ఓటరు గుర్తుంపు కార్డు ఉందని ఓ మీడియా సంస్థ వార్తను ప్రసారం చేసింది. మనోజ్‌ ఓటరు కార్డు ఫొటోను చూపిస్తూ.. కథనం ప్రసారం చేసింది. దీనిపై మనోజ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. అది తప్పుడు ఓటరు కార్డని చెప్పారు. ‘ఇవాళ నా ఓటరు కార్డుపై వచ్చిన ఓ వార్త వీడియో చూశా. నా కార్డులో ఫిల్మ్‌నగర్‌లోని నా ఇంటి చిరునామా ఉంది. ఈ వార్తలో నిజం లేదు. ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని ఆయన ట్వీట్‌ చేశారు. . కొన్ని రోజుల క్రితం ఆయన ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. సమాజసేవలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.

Leave a Response