దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ, మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’ అంటున్నారు శర్వానంద్. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రణ రంగం’ కాజల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలు శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్రణరంగం
‘సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. శర్వానంద్ రెండు షేడ్స్‌ను ఈ టీజర్లో రివీల్ చేశారు. `దేవుణ్ణి నమ్మాలంటే భక్తుంటే సరిపొద్ది.. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి` అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. కొందరికీ అతను క్రిమినల్.. మిగిలిన వారికి హీరో అనే క్యాప్షన్‌తో గ్యాంగ్‌స్టర్ రోల్‌ను ఆవిష్కరించారు. వాళ్లెవరు? దేవాను ఎందుకు చంపాలనుకున్నారు? అని కాజల్ ప్రశ్నతో 90 దశకంలో కూడా శర్వా కథ ఉంటుందని చూపించారు. అంటే ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించింది. కోపాని, దాహాన్ని ఇంకొకరు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు.. పదండ్రా! అనే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. టీజర్ చాలా ఆసక్తిని రేపుతుంది.ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.