టాలీవుడ్ నటుడు మాధవన్ తన ప్రియమైన భార్య సరితా బిర్జే ప్రేమలో మునిగి తేలుతున్నారన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈరోజు మాధవన్ దంపతుల 20వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన భార్యను ఉద్దేశిస్తూ మాధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మధురమైన పోస్ట్‌ను పెట్టారు. ‘నీ చిన్ని నవ్వు, కళ్లలో మెరుపు చాలు.. నేనో రాజులా ఫీలవడానికి. నిస్వార్ధమైన నీ ప్రేమ నన్నో బానిసను చేసింది. నువ్వెంతో అందంగా ఉంటావు. నీ పిచ్చి ప్రేమలో మునిగి తేలుతున్నాను. మై లవ్’ అని పేర్కొంటూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
కెరీర్ పరంగా తాను ఈ స్థాయిలో ఉండటానికి సరిత పాత్ర ఎంతో కీలకమని మాధవన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తన కోసం ఖరీదైన ఫ్లాట్‌ను వదిలేసి ఓ చిన్న ఇంట్లో ఉండటానికి కూడా ఆమె వెనుకాడలేదని, సరిత తన భార్య కావడం తన అదృష్టమని చెప్పారు. ప్రస్తుతం మాధవన్ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అనంత్ మహాదేవన్, మాధవన్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు.