టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమల అక్కినేని, తెలుగు సినిమా నటి మరియు జంతు సంక్షేమ కార్యకర్త. అమల తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ. ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీ ఆరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీ రాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు. ఆ చిత్రంలో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిరువురూ 1993లో వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది. వీరిరువురికీ 1994లో అఖిల్ అనే కుమారుడు కలిగాడు. టాలీవుడ్ కింగ్ హీరో నాగార్జున, అమల ఇద్దరిదీ లవ్ మ్యారేజే అనే సంగతి తెలిసిందే. ఈ విషయమే ఆమె మాట్లాడుతూ…. తెలుగులో ‘కిరాయి దాదా’ విడుదలయ్యాక నాగార్జునతో కలిసి ఐదు సినిమాల్లో నటించా. షూటింగ్‌లోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఆ విషయం అమ్మకు చెప్పాను. దాంతో వెంటనే తనే పెళ్లికి ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే మొదట్నుంచీ నేను సరైన నిర్ణయాలే తీసుకుంటానని తన నమ్మకం. పెళ్లయ్యాక ఇంటి బాధ్యతల కోసం సినిమాలకు దూరం అవ్వాలన్న నా ఆలోచననీ అమ్మ శభాష్ అని మెచ్చుకుంది అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సుందరి అక్కినేని అమల ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘నా ప్రేమ, సర్వస్వం అయిన అక్కినేని నాగార్జునకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నాకు వస్తున్న అభినందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నా. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు’ అని అమల ట్వీట్ చేశారు. అక్కినేని నాగార్జున, అమల 1992, జూన్ 11న వివాహం చేసుకున్నారు.
previous article
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకు ఏమి చేసారు ?
next article
నయనతారకు హైకోర్టు షాక్..
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment