“బైబయ్యే బంగారు రమణమ్మా…”, “తాటిచెట్టెక్కలేవు… తాటికల్లు తెంపలేవు…”, “ఏం పిల్లడో ఎల్దమొస్తవా…” వంటి శ్రీకాకుళం జానపద పాటలు తెలుగు సినిమాల్లో వినిపిస్తూ, ఫ్యాన్స్ తో ఈలలు వేయించాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇవి వినిపిస్తుంటాయి అన విషయం తెలిసిందే. ఆయనే స్వయంగా వీటిని పాడుతుంటారు కూడా. ఇక తన బాబాయ్ పవన్ దారిలోనే నడవాలని భావిస్తున్న అల్లు అర్జున్. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోనూ ఇదే తరహా పాట ఒకటి ఉండటం విశేషం. దీన్ని తమన్ స్వరపరిచారని, ఈ పాటను మాత్రం ముందుగా విడుదల చేయబోమని, సినిమాలో మాత్రమే చూపుతామని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇక సినిమాలోని రెండు పాటలు “సామజవరగమన… నిను చూసి ఆగగలనా”, “రాములో రాములా… నా ప్రాణం తీసిందిరో” పాటలు విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి మన అందరికి తెలిసిందే.
