బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్. ఆయన చేసిన సినిమాల ద్వారా జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులే కాక భారత సినీ పరిశ్రమలో చేసిన కృషికిగానూ మిగతా పోటీల్లో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు అమితాబ్. 1991లో రాజ్ కపూర్ పేరు మీదుగా స్థాపించిన ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు ఆయన. 2000 ఫిలింఫేర్ అవార్డుల్లో సూపర్ స్టార్ ఆఫ్ ది మిలీనియం పురస్కారం పొందారు అమితాబ్. ఇక అసలు విషయానికి వస్తే బచ్చన్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. టర్కీష్‌కు చెందిన హ్యాకర్ గ్రూప్‌గా భావిస్తున్న అయిల్దిజ్ టిమ్ సోమవారం రాత్రి అమితాబ్ బచ్చన్ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసింది. అమితాబ్ బచ్చన్ ప్రొఫైల్ ఫొటోను మార్చి.. ఆయన ఖాతాలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను పెట్టింది. అదేవిధంగా ఆయన వ్యక్తిగత వివరాలను కూడా మార్చి.. ‘లవ్ పాకిస్థాన్’ అని పేర్కొంటూ టర్కీష్ జెండా ఏమొజీని ఉంచింది. అమితాబ్ ఖాతాను హ్యాక్ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై సైబర్ యూనిట్ దర్యాప్తు జరుపుతోందని ముంబై పోలీసులు చెప్తున్నారు. అమితాబ్ ఖాతా కవర్ ఫొటోను మార్చి… ఆ స్థానంలో హ్యాకర్లు తమ గ్రూప్‌కు సంబంధించిన ఎగిరే రాబంధు ఫొటోను పెట్టారు. ‘సమస్త ప్రంపచానికి ఇదే మా పిలుపు.
టర్కీష్ ఫుట్‌బాలర్స్ పట్ల ఐస్‌ల్యాండ్ రిపబ్లిక్ ప్రవర్తించిన తీరును మేం ఖండిస్తున్నాం. మేం మృదువుగా మాట్లాడినా.. కఠినంగా వ్యవహరిస్తాం. అది చెప్పడానికే ఈ సైబర్ దాడి. -అయిల్దిజ్ టిమ్ టర్కీష్ సైబర్ ఆర్మీ’ అంటూ హ్యాకర్లు అమితాబ్ ట్విటర్ ఖాతాలో పోస్టు పెట్టారు. భారత్‌లోని ముస్లింలను ఉద్దేశించి కూడా హ్యాకర్లు పోస్టు చేశారు. అయితే, హ్యాకింగ్ బారిన పడ్డ అమితాబ్ ట్విటర్ అకౌంట్‌ను ఒక గంటలోనే పునరుద్ధరించారు. గతంలో ఈ హ్యాకర్ల గ్రూప్ షహీద్ కపూర్, అనుపమ్ ఖేర్ తదితరుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసింది.