తన శక్తి మేర స‌మాజ సేవ‌…..

త‌మిళ స్టార్ హీరో సూర్య సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కులను మెప్పించ‌డ‌మే కాదు.. శివ‌కుమార్ విద్యా ట్ర‌స్ట్‌, అగ‌రం ఫౌండేష‌న్‌ ద్వారా తన శక్తి మేర స‌మాజ సేవ‌ కూడా చేస్తున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం.. శివ‌కుమార్ విద్యా ట్ర‌స్ట్‌, అగ‌రం ఫౌండేష‌న్‌ ఆధ్వ‌ర్యంలో 10వ త‌ర‌గ‌తిని ప్ర‌థ‌మ స్థానంలో ఉతీర్ణ‌త సాధించిన పేద విద్యార్థుల‌కు ఆర్ధిక సాయం అందించారు హీరో సూర్య‌. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌నున్న కొత్త విద్యా విధానంపై ఆయన చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపాయి. నీట్ విధానాన్ని సూర్య త‌ప్పుబ‌ట్టారు. కేంద్ర ప్ర‌భుత్వ విద్యావిధానంపై ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే సూర్య వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నేత‌లు త‌ప్పు ప‌డుతుండ‌గా.. ఆయ‌న స‌న్నిహితులు మాత్రం స్వాగ‌తిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ప‌నేంటో తాను చేసుకుని వెళ్లిపోవడం హీరో సూర్యకు అలవాడు. అయితే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం వల్ల ఆయ‌న సినిమాల విడుద‌ల‌పై ప్రతికూల ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని కొంద‌రు అంటున్నారు.

Leave a Response